విజయవాడ, సామాజిక స్పందన:
నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు 28 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ని కలసి జర్నలిస్ట్ హక్కులను కాపాడాలని కోరుతూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) వినతిపత్రాన్ని అందచేసి సమస్యలపై చర్చించారు...
ఈ సందర్భంగా ఎన్.ఏ.ఆర్.ఏ ఫౌండర్ మరియు జాతీయ అధ్యక్షులు సురేంద్ర బాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వాల పరంగా కానీ, యాజమాన్యాల పరంగా కానీ ఎలాంటి ఆర్థిక భరోసా లేదని జర్నలిస్టులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ పిల్లల్ని కనీసం చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారని, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని సురేంద్రబాబు అభిప్రాయపడ్డారు. జర్నలిస్ట్ పిల్లల విద్యకు సంబంధించిన అంశంపై బుధవారం విజయవాడలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ని కలవడం జరిగిందని, అక్రిడేషన్ తో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరి పిల్లలకు ఉచిత విద్యను కల్పించాలని మంత్రిని సురేంద్రబాబు కోరారు. ప్రైవేట్ విద్యాలయాల్లో ఉచిత విద్యకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఒకటే జీవోను విడుదల చేయాలని, ఆరవ తరగతి నుంచి పి.జి వరకు జర్నలిజం కు సంబంధించి ఒక చాప్టర్ పెట్టాలని, కేజీ నుంచి పీజీ వరకు వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని మంత్రి ని సురేంద్రబాబు కోరారు.
నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు ఇచ్చిన డిమాండ్లపై ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించారు. మీరు ఇచ్చిన డిమాండ్ లను క్షుణ్ణంగా పరిశీలించి మీకు పూర్తి న్యాయం చేస్తానని జర్నలిస్ట్ నాయకులకు ఆయన భరోసా ఇచ్చారు.
జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియ చేసారు. మంత్రి బొత్స సత్యనారాయణ ని కలసిన వారిలో జాతీయ అధ్యక్షులు సురేంద్ర బాబు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.ఏ.ఆర్.ఏ నాయకులు మక్కెన సురేంద్ర బాబు, కాలేషా, మధు, ఎ.వి.వి శ్రీనివాసరావు, శ్రీకాంత్, ఎస్ నాగరాజు, గుంటూరు, కృష్ణ జిల్లాల రిపోర్టర్స్ పాల్గొన్నారు.










0 Comments